![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -181 లో... కావ్యని రాజ్ ఇంట్లో నుండి గెంటేస్తే కనకం, కృష్ణమూర్తి ఇద్దరు కలిసి కావ్యని తీసుకొని లోపలికి వెళ్ళి దుగ్గిరాల ఫ్యామిలీని నిలదీసస్తారు. ఆ తర్వాత దుగ్గిరాల ఇంటి నుండి కావ్యని తీసుకొని బయలుదేరుతారు. అప్పుడే వాళ్ళకి ఎదురుగా సుభాష్ వస్తాడు. అసలు ఇంట్లో ఏం జరిగిందనే విషయం తెలియని సుభాష్.. నా కోడలిని ఇప్పుడు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారని అడుగుతాడు. వాళ్ళు మౌనంగా ఉంటారు.
ఆ తర్వాత ఇంట్లో ఉన్న ప్రకాష్ ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్తాడు. నా కోడలు ఎక్కడికి రాదు. మీరు ఈ ఇంటికి పంపించాక నేనే తనకి తండ్రి లోపలికి పదండి అంటూ వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇంట్లోకి వెళ్లిన సుభాష్.. రాజ్ అపర్ణలపై కోప్పడతాడు. ఈ ఇంటి కోడలిని అలా పంపిస్తారా అంటూ సుభాష్ విరుచుకుపడుతాడు. మధ్యలో మాట్లాడిన రుద్రాణికి సుభాష్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఎవరేం అన్నా.. నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళడానికి వీలు లేదు. ఈ ఇంటి కోడలిగా , ఇంట్లో ఉండే బాధ్యత నీది అని కావ్యని లోపలికి పంపిస్తాడు. ఆ తర్వాత జరిగిన దానిని గుర్తుచేసుకుంటూ అందరూ బాధపడుతారు. కానీ రాజ్ మాత్రం చాలా కోపంగా ఉంటాడు. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి సుభాష్ వెళ్తాడు. మీరు చేసింది నాకు నచ్చలేదని అపర్ణ అంటుంది. ఈ ఇంటి కోడలిని ఆలా చెయ్యడం నాకు నచ్చలేదని సుభాష్ అంటాడు. కావ్య ఈ ఇంటి నుండి వెళ్ళిపోతే పోయేది మన ఇంటి పరువని సుభాష్ చెప్తాడు. కావ్య గురించి ఏం చెప్పినా అపర్ణ మాత్రం ఏం పట్టనట్లు ఉంటుంది. మరొకవైపు కావ్య పరిస్థితి చూసి కనకం, కృష్ణమూర్తి ఇద్దరు బాధపడతారు. అంత జరిగిన తర్వాత అక్కని అక్కడే ఎందుకు వదిలేసి వచ్చారని కనకం, కృష్ణమూర్తిని అప్పు అడుగుతుంది. అది తన అత్తారిల్లు.. తను అక్కడే ఉండాలని కనకం చెప్తుంది.
మరొకవైపు కావ్య కోపంగా ఉన్న రాజ్ దగ్గరికి వస్తుంది. మీరు నన్ను అవమానించారు. మీరు మాట్లాడించాలి అయిన నేనే మాట్లాడిస్తున్నాను. కనీసం నన్ను వివరణ అయిన ఇచ్చుకోనివ్వండని రాజ్ తో కావ్య అంటుంది. మీ అమ్మ గారిని నేను కావాలనేమీ అనలేదని కావ్య అనగానే.. రాజ్ కోపంగా చెయ్యిని గోడకేసి కొడుతాడు. చేతికి రక్తం కారుతుంది. అది చూసి కావ్య రాజ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేసిన.. రాజ్ కావ్యని దగ్గరికి రానివ్వడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |